Sunday, 1 December 2013

నిశ్శబ్దాన్ని చేధిద్ధాం..

World Aids Day today  10tv.in
 నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం. ప్రపంచంలో ఎన్నో రోగాలు. వాటిలో కొన్నింటికి మందులున్నాయి. అలాంటి వ్యాధుల్లో ఒకటి 'ఎయిడ్స్'. ప్రజల జీవితాలను హరించి వేస్తున్న ఈ ఎయిడ్స్ మహమ్మారికి మందు కనిపెట్టాలని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కాని నేటికి మందు కనిపెట్టలేకపోయారు. ఇది అమెరికాలో తొలిసారి బయటపడింది. మనదేశంలో ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గినా సర్కార్ మాత్రం దీనిపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వహిస్తుందనే చెప్పవచ్చు.    1988 డిసెంబర్ 01 నుండి ప్రపంచ ఎయిడ్స్ దినంగా పాటిస్తున్నారు. 1981 జూన్ 5వ తేదీన అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో ఎయిడ్స్ గుర్తించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్లకు ఈ వ్యాధి సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో మొట్టమొదటిసారిగా 1986లో గుర్తించారు. అనంతరం 1987లో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం అనేది దేశంలో మొదలైంది. దేశంలో హెచ్ఐవి రోగుల సంఖ్య 5.70 నుండి 2.56 కోట్లకు తగ్గినట్లు.........See More  

Monday, 25 November 2013

'బంగారు తల్లి'కి బాలారిష్టాలు..! ''
ఇక నుంచి పుట్టబోయే ఆడపిల్లలందరూ బంగారు తల్లులే.. ఏ ఇంట్లో కూడా ఆడపిల్ల పుట్టిందని బాధపడేవారు ఉండరు..'' కొన్ని రోజుల కిందట ఏ సభలో మాట్లాడినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటి నుంచి వెలువడిన వాక్కులివే! ఆర్భాటపు ప్రచార పర్వాలతో పురుడు పోసుకున్న సీఎం మానస పుత్రిక 'బంగారు తల్లి'కి పురిట్లోనే సంధికొట్టింది. అర్హులైన వారి ఒడిచేరకుండా నూటొక్క కష్టాలపాల్జేస్తోంది. దీంతో.. 'బంగారు తల్లి' గురించి కిరణ్ పలికిన పలుకులన్నీ చెల్లని కాసులేనని తేలిపోయింది. 'బంగారు తల్లి'కోసం ప్రాణాలు కోల్పోయిన చిట్టితల్లి...       నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట తండాకు చెందిన గిరిజన....See More      



Wednesday, 20 November 2013

స్వస్థలానికి చేరిన మెడికో కామేష్ మృతదేహం

Kamesh www.10tv.in

మహబూబ్ నగర్... కర్ణాటకలో దుండగుల దాడిలో మృతి చెందిన మెడికో విద్యార్థి కామేష్‌ మృతదేహాన్ని సొంత నివాసమైన మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తికి అధికారులు తీసుకొచ్చారు. కామేష్ మృతితో కల్వకుర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కామేష్ మృతికి సంతాపంగా విద్యార్థులు పట్టణంలో కొవ్వొత్తి ర్యాలీ చేశారు. మృత దేహాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు, నేతలు వంశీచందర్‌, చిత్తరంజన్‌దాస్‌లు కామేష్‌ మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబ.. See More...

Tuesday, 19 November 2013

మహబూబ్ నగర్ లో ఇద్దరికి స్వైన్ ఫ్లూ..

Two Sine Flu Cases www.10tv.in

మహబూబ్ నగర్.. జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలోని మాటూరు గ్రామంలో ఇద్దరికి సైన్ ఫ్లూ సోకినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. మాటూరు గ్రామానికి చెందిన కుటుంబంలో కొందరికి జ్వరం రావడంతో ఈనెల 14వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈవైద్య పరీక్షల్లో వీరమణికి, మరొకరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. గ్రామస్తులను వైద్యులు అప్రమత్తం చేశారు. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్టోబర్.. See More...

చట్ట'భద్రత' లేని సిబిఐ..!

CBI at UPA www.10tv.in
కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)చట్టబద్ధతపై గౌహతి హై-కోర్టు ఇచ్చిన తీర్పుతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు సిబిఐ ఆత్మరక్షణలో పడాల్సివచ్చింది. అసలు సిబిఐ రాజ్యాంగ బద్ధ దర్యాప్తు సంస్థే కాదని, సిబిఐ ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. దీనిపై హుటాహుటిన కేంద్రం సుప్రీంను ఆశ్రయించడంతో.. అత్యున్నత ధర్మాసనం 'గౌహతి' తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6 కు వాయిదావేసింది.    ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు సుప్రీం నోటీసులు జారీచేసింది. పక్షంలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. దీంతో తదుపరి చర్యలపై కేంద్ర సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. సిబిఐకి చట్టబద్ధత సాధించే ప్రయత్నాలను ముమ్మరం చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని చిక్కులు ఎదుర్కొనే పరిస్థితులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. సిబిఐకి చట్టబద్ధత హోదా కల్పించకపోతే దాని దర్యాప్తు పరిధి ప్రశ్నార్థకంగా మారే.. See More...

దుండగుల దాడిలో గాయపడ్డ వైద్యవిద్యార్ధి మృతి

Student Sai Prasad www.10tv.in

మహబూబ్ నగర్... కర్నాటక రాష్ట్రం కోలార్‌లో దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంబిబిఎస్ విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ మంగళవారం మృతి చెందాడు. ఈ నెల 12న కళాశాల లైబ్రరీ నుంచి తిరిగివస్తున్న ప్రసాద్పై దుండగులు పెట్రోలు పోసి నిప్పంటించిన విషయం విదితమే. చికిత్స నిమిత్తం అతనిని బెంగుళూరు నుంచి కల్వకుర్తి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే వైద్యసేవలు అందిస్తుండగా ప్రసాద్ మరణించాడు.    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కామేశ్వర సాయిప్రసాద్ బెంగళూరులో ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 12వతేదీ రాత్రి.. See More..